వీధి కుక్క‌ల కోసం లైఫ్ గార్డుల నియామ‌కం

లాక్ డౌన్ కార‌ణంగా మూగ‌జీవాల‌కు ఆహారం దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఆక‌లితో ఉన్న కోతులు, కుక్క‌లు ఇత‌ర జంతువుల‌కు ప‌లు ఎన్జీవో సంస్థ‌లు ముందుకొచ్చి ఆహారం అందిస్తున్నాయి. గోవాలో వీధికుక్క‌లకు ఆహారం అందించేందుకు దృష్టి మెరైన్ ఏజెన్సీ లైఫ్ గార్డ్స్ (అంగ‌ర‌క్ష‌కులు)ను ఏర్పాటు చేసింది.


గోవా తీర‌ప్రాంతాల్లో తిరుగాడే వీధికుక్క‌లు, ఇత‌ర జీవుల‌కు ఆహారం, నీటిని అందించేందుకు లైఫ్ గార్డ్స్ ప్ర‌త్యేక వాహ‌నాల్లో తిరుగుతున్నారు. గ‌త వారమే తీర‌ప్రాంతం వెంబ‌డి 38 లైఫ్ గార్డుల‌ను నియ‌మించాం. వీధి కుక్క‌ల కోసం ప్ర‌త్యేకంగా నీటి కేంద్రాల‌ను ఏర్పాటు చేశాం. వేస‌విలో ప‌క్షులు, ఇత‌ర జంతువుల కోసం పెద్ద నీటి గుంత‌ల‌ను ఏర్పాటు చేశాం. ప్ర‌తీ రోజు 30 కిలోల ఆహారం, 30 లీట‌ర్ల నీరు అందిస్తున్నామ‌ని దృష్టి మెరైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ర‌విశంక‌ర్ తెలిపా రు.