నేటి నుంచి చెర్వుగట్టు జాతర

ల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 6 వరకు వారం పాటు జరగనున్నాయి. జాతరలో తొలిరోజు శనివారం ఉదయం ఉత్సవాలకు అంకురార్పణ, ఆదివారం తెల్లవారుజామున రథసప్తమి ఘడియల్లో స్వామివారి కల్యాణం, సాయంత్రం తెప్పోత్సవం, 3న రాత్రి అగ్నిగుండాలు, 4న రాత్రి అశ్వవాహన సేవ, దోపోత్సవం, 5న పుష్పోత్సవం, ఏకాంతసేవలు, 6న గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.