ఎండోమెంట్‌ సిబ్బంది వేతనాల కోసం నిధులు విడుదల

ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది వేతనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.41.56 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెల వరకు వేతనాలు ఇవ్వడానికి ఈ నిధులు విడుదల చేశారు.